బుల్లెట్ బండి సాంగ్ ముహూర్తాన బయటకు వచ్చిందో కానీ ఆ సాంగ్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు అని చెప్పాలి. కుర్ర కారునే కాదు పెద్దలను సైతం  ఉర్రూతలూగించింది. పెళ్లిలో ఎప్పుడు తలదించుకొని ఉండే పెళ్లి కూతుర్లు కాలు కదిపేలా చేసింది. ఎంతోమందిని సెలబ్రిటీలను చేసింది.. ఇలా ఎక్కడ చూసినా బుల్లెట్ బండి పాట వినిపించింది. ఇప్పటికీ కూడా అదే ట్రెండు కొనసాగుతుంది. ఫంక్షన్ ఏదైనా ఈవెంట్ ఎక్కడైనా సరే ఇదే సాంగ్ వినిపిస్తుంది. నేటితరం మొత్తం అటు బుల్లెట్ బండి పాటపై మనసు పారేసుకున్నారు అన్నది మాత్రం అర్థం అవుతుంది.


 ముఖ్యంగా ఆడపిల్లలకు ఫేవరెట్ సాంగ్ గా మారిపోయింది. ఎందుకంటే బుల్లెట్ బండి పాటపై డాన్స్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఏకంగా సెలబ్రిటీ అయిపోవచ్చు అని ఇటీవల కాలంలో ఎంతోమంది అనుకుంటున్నారు. అంతేకాదు ఇక పెళ్లి చేసుకున్న వధువు కూడా తమ పెళ్ళిలో తప్పకుండా బుల్లెట్ బండి పాటపై డాన్స్ చేయాల్సిందే అంటూ గట్టిగా ఫిక్స్ అవుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. పెళ్లయ్యాక భరాత్ టైంలో లేదా రిసెప్షన్ సమయంలో ఇలా ఈ పాట పై డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఓ నవవధువు రిసెప్షన్లో నిజంగానే పెళ్ళికొడుకుకు షాక్ ఇచ్చింది. సాధారణంగా పెళ్లిలలో ఎక్కువగా అబ్బాయిలు డాన్స్ చేస్తూ ఉంటే అమ్మాయిలు డాన్స్ చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు. డాన్స్ చేయమని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఎంత అడిగినా కూడా ఒప్పుకోరు. కానీ ఇక్కడ మాత్రం ఇందుకు రివర్స్ జరిగింది. పెళ్ళికొడుకు ఇబ్బంది పడుతుంటే అతను చెయ్యి పట్టుకుని డాన్స్ చేసింది వధువు. వరుడు సైలెంట్ గా నిలబడితే ఏమి పట్టించుకోకుండా పెళ్లికూతురు మాత్రం అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. ఇక ఇది చూసిన నెటిజన్లు  పెళ్లికూతురు భలే షార్ప్ గా ఉంది అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో అబ్బాయిలు అమ్మాయిగా.. అమ్మాయిలు అబ్బాయిలా మారిపోయారు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: