వ్యక్తి చేతి రాత అతని ఆలోచనా తీరుకు అద్దం అని కొందరు అంటూ వుంటారు. స్టూడెంట్స్ కు అయితే చేతిరాత అనేది ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.చేతి రాత అనేది అందంగా బాగుంటే ఇక నల్ల ముత్యాలను ఏరుకోవచ్చని..అదే చేతి రాత అర్ధం కాకుండా ఉంటే .. బ్రహ్మ కు సాధ్యం కాదంటూ సరదాగా అంటుంటారు కూడా..ఏ విద్యార్థికైనా కూడా అతని చేతివ్రాత చాలా ముఖ్యమైనది. రాత బాగుంటే ఆ స్టూడెంట్ ను టీచర్ బాగా ఇష్టంగా చూసుకుంటూ ప్రేమిస్తారు.ప్రత్యేకంగా ఆ పిల్లలను గుర్తు పెట్టుకుంటారు కూడా.. మన జాతిపిత మహాత్మా గాంధీ అయితే తన చేతిరాత అందంగా లేదని జీవితాంతం తంటాలు పడ్డారు.మంచి చేతిరాతతో చాలా మంది విద్యార్థులు తమకు విద్యాబుద్ధాలు నేర్పిన ఉపాధ్యాయులకు ఇష్టమైన వారిగా మిగిలిపోయారో చాలామందికి తెలుసు. అందుకే చిన్నతనంలో పిల్లల మన చేతివ్రాతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టేవారు. 


తమ చేతి రాత మెరుగుపరిచేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అయితే కొందరి చేతి రాత.. ముత్యాల్లా.. అందమైన ఆర్ట్ లా ఉంటే.. మరికొందరి చేతి రాత గజిబిజిగా ఉంటుంది. ఇటువంటి స్టూడెంట్స్ తమ టీచర్స్ చే దెబ్బలు తిన్నవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చేతివ్రాత వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.ఇక దీన్ని చూసిన తర్వాత మహా మహా మేథావులు కూడా తమ ముక్కున వేలేసుకుంటున్నారు.ఇక ఒకప్పుడు మనుషుల మనస్తత్వాలను కూడా వారి చేతి రాత ద్వారానే అంచనా వేసేవారు. ఎవరి రాత చాలా అందంగా ఉందో.. వారిని ప్రజలు చాలా ఎక్కువగా గౌరవించేవారు. అయితే ఇప్పుడు మనమందరం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం.. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుత జనరేషన్ అయితే రాయడం మరచిపోయింది అని కూడా చెప్పవచ్చు.ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైన అందమైన రాత కనిపిస్తే కళ్లు ఆనందంతో బాగా మెరుస్తాయి. అలాంటి ఒక అందమైన చేతివ్రాత ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: