సాదరణంగా అడవుల్లో ఉండే ప్రమాదకరమైన జీవులు ఏవి అంటే పులులు సింహాలు అని చెబుతూ ఉంటారు అందరూ. అయితే పులులు సింహాలతో పాటు అటు ఎలుగుబంట్లు కూడా ఎంతో ప్రమాదకరమైనవి అన్న విషయం తెలిసిందె. ఎందుకంటే తనకు హాని ఉంది అని తెలిస్తే ఎలుగుబంటి ఎంతటి జీవినైనా సరే ఎదిరించడానికి సిద్ధమవుతూ ఉంటుంది.  కొన్ని కొన్ని సార్లు పులులు సింహాలతో సైతం పోటీపడి విజయం సాధిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఎలుగుబంటి దాడి చేసింది అంటే అది ఎంతో భయంకరంగా ఉంటుంది అన్నది ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోలు ద్వారా చూసాము.


 అయితే ఇటీవల కాలంలో అడవుల్లో ఉండే చిరుతపులు లాంటి జీవులు అటు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. వెరసి ఇక ఎంతోమందిని గాయపరుస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే కేవలం చిరుతపులులు మాత్రమే కాదు అప్పుడప్పుడు ఎలుగుబంట్లు కూడా ఇలాగే జనావాసాల్లోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక భారీ ఎలుగుబంటు జనాభాసాల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. అయితే తన వైపే దూసుకు వస్తున్న ఒక భారీ ఎలుగుబంటు నుండి ప్రాణాలను దక్కించుకునేందుకు ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు.


 సాధారణంగా భారీ ఆకారం ఉన్న ఎలుగుబంట్లు చెట్లను ఎక్కలేవు అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే ఆలోచన అతని మనసులో తట్టింది. ఈ క్రమంలోనే తనపై దాడి చేయడానికి వచ్చిన ఎలుగుబంటి నుంచి తప్పించుకునేందుకు పక్కనే ఒక చెట్టు ఎక్కాడు.అయినప్పటికీ ఎలుగుబంటు మాత్రం అతని వదిలిపెట్టలేదు. ఏదో ఒక విధంగా కిందికి లాగేందుకు ప్రయత్నించింది. అయితే ఆ తర్వాత అతనిపై దాడి చేసేందుకు ఎలుగుబంటు కూడా చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించినప్పటికీ అది కిందికి జారిపోయింది. దీంతో ఇక అతనిపై దాడి చేయాలి అన్న ఆలోచన విరమించుకుంది. ఇలా సరైన సమయంలో తెలివిగా ఆలోచించి అతను ప్రాణాలను దక్కించుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: