ఇలాంటి సమయంలోనే ప్రయాణాలు సాగిస్తున్నప్పుడు కునుకు తీస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. బస్సు ఆటో లేదా కారు మెట్రో లాంటి వాటిలో ఎంతోమంది కునుకు తీస్తున్నారు. అయితే ప్రయాణాలలో ఇలా నిద్రపోవడం అనేది సర్వసాధారణం. దాదాపు 90 శాతం మంది ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు ఒక కునుకు తీస్తూ ఉంటారు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు నిద్రపోవడం ఎంతో ప్రమాదకరమని చెప్పాలి. ఇలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కునుకు తీసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఇక బస్సులో గానీ లేదా ఆటోలో గానీ వెళుతున్నప్పుడు కునుకు తీస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అన్నదానికి సంబంధించి ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి గాడ నిద్రలోకి వెళ్ళాడు. అయితే అతని తల ఒకవైపు వంగుతూ చివరికి కింద పడిపోయాడు. దీంతో ఆ బస్సులో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో బస్సులో ఉన్న వాళ్లంతా ఏమైందంటూ అతని వైపు చూసారు. అయితే కింద పడిన వ్యక్తి లేచి మళ్ళీ తన సీట్ లోకి వెళ్లి కూర్చుంటాడు. అయితే అతను కింద పడిపోయిన సమయంలో ఏకంగా అతని మెడ ఒకసారిగా నేలకు తాకుతుంది. అయితే ఇది జరిగిన సమయంలో అతను గాయాల బారిన పడకుండా బయటపడగలిగాడు. ఇది చూసి మరోసారి ప్రయాణాలు చేసేటప్పుడు నిద్రపోకూడదు అని నెటిజన్స్ అనుకుంటున్నారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి