ఉపాధి పనులలో ప్రస్తుతం పలు రకాల మార్పులు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.. ముఖ్యంగా ఇందులో..చిన్న కారు రైతులకు 100% రాయితీతో మామిడి, జామ, చింత, అల్లనేరేడు, నిమ్మ, సపోటా, కొబ్బరి ,సీతాఫలం దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ ,బత్తాయిలు, పశుగ్రాసం మల్లెపూల తోటల(ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు) రెండేళ్ల వరకు పూర్తి నిర్వహణ అయ్యేంత ఖర్చులను సైతం చెల్లింపు చేస్తారట.


ఇప్పటికే పండ్ల తోటను సాగు చేస్తున్న రైతులకు పొలం గట్ల వెంబడి టెంకాయ చెట్లు, చింత చెట్లు, తదితర ఉద్యానవన పంటలకు పెట్టినవారికి అయ్యే ఖర్చులను సైతం చెల్లిస్తారట.

అలాగే పొలం గట్ల వెంబడి టేకు, ఎర్రచందనం ,కలప మొక్కలను పెంచితే రెండేళ్ల పాటు వీటికి అయ్యేటువంటి ఖర్చులను సైతం ప్రభుత్వం చెల్లిస్తుందట.

పట్టుగూళ్ల పెంపకం చేపట్టిన రైతులకు బుష్ ప్లాంటేషన్ తో  పాటు సెరికల్చర్ ప్లాంటేషన్ చేపట్టేందుకు సైతం 2 ళ్లపాటు అయ్యే ఖర్చులను సైతం కేంద్రం చెల్లిస్తుందట.


అలాగే పశువులు, గొర్రెలు, మేకలు, కలిగిన రైతుల కుటుంబాలు గడ్డి పెంపకం కోసం రెండేళ్ల పాటు  వీటికి అయ్యే ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందట.

గ్రామాల్లో మురుగు దొడ్ల ద్వారా నీరు  రోడ్లపై రాకుండా ఆ నీరు నిల్వ ఉంచకుండా ఈ నీటి వల్ల వచ్చే దుర్వాసన దోమల బెడద లేకుండా చేసేందుకు సోక్ పిట్స్ ఏర్పాటు చేసేందుకు రోడ్డుకి రెండు వైపులా మొక్కలను పెంపకం కోసం అయ్యేటువంటి ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తుందట.

ఇకపై ఉపాధి హామీ పథకం కూలీలకు ముఖ ఆధారిత హాజరు ఉంటుందట .దీంతో పాటు మరిన్ని పనులు మార్గదర్శకాల్లో ఉన్నాయి. దాదాపుగా ఫేక్ ఐడి ఉన్నటువంటి 10 లక్షల మంది కార్డులను సైతం తొలగించినట్లుగా తెలుస్తున్నది. రాబోయే రోజుల్లో మరింత పగడ్బందీగా ఈ ఉపాధి హామీ పథకం అమలు లోకి రాబోతోందని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: