ప్రతి ఒక్కరు వాళ్ళ ఆచారాలను వాళ్ళ సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తూ ఉంటారు.  కొంతమందికి అది మూఢనమ్మకం కావచ్చు మరి కొంతమందికి చూడడానికి విడ్డూరంగా ఉండొచ్చు.. మరి కొంతమందికి అది క్రూరమైన చర్యంగా కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు వాళ్ళ సంప్రదాయాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు.  కొంతమంది నాన్ వెజ్ తినడం శాపంగా అనుకుంటారు . కొంతమంది నాన్ వెజ్ తిననిదే ముద్ద కూడ దిగదు . కొంతమంది దేవుళ్ళకి కూడా నాన్ వెజ్ పెడుతూ ఉంటారు.  ఇలా ఎవరికి సంబంధించిన సాంప్రదాయం వారికి ఉంటుంది.  అది ఎదుటివారికి కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉండొచ్చు.  మరీ ముఖ్యంగా ప్రపంచంలోనే అతి క్రూరమైన తెగ ఒకటి ఉంది . ఆ తెగలోని అమ్మాయిలు తమ బాడీ పార్ట్ ను కత్తిరించుకోవాల్సిందే . దీనికి సంబంధించిన విషయాలను ఇప్పుడు మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


ఇథియోపియాలోని ఓయో లోయ ప్రాంతంలో నివసించే ముర్సీ తెగ ప్రజల జీవితం ఎంతో రహస్యం . మరీ ముఖ్యంగా ఆ తెగలో జన్మించిన మహిళలు తమ అందాన్ని పెదవిలో మట్టి ప్లేట్ పెట్టించడం ద్వారా వెల్లడిస్తూ ఉంటారు . ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న భయంకరంగా ఉన్న అది వాళ్ళ సాంప్రదాయం . పూర్వకాల సాంప్రదాయాలతో ఈ తెగ నిండి ఉంటుంది . ఇది వారి భౌతిక శక్తిని అదేవిధంగా సాహసాన్ని వాళ్ళ సంస్కృతిని ప్రతిపాదిస్తుంది అని ..వాళ్ళు నమ్ముతూ ఉంటారు.  ఆడపిల్లలు ఒక వయసుకు రాగానే కిందటి పెదవిలో చిన్న గుణపాన్ని కట్ చేసేస్తారు . ఆ తర్వాత మట్టి ముద్దలతో చేసిన చిన్న గుండ్రాని ప్లేట్ ని అక్కడ పెడతారు.


కొంతకాలానికి అది పెద్దదిగా మారుతూ పెదవిని కూడా విస్తరింపజేసిస్తుంది.  చివరికి కొన్ని ఇంచుల పొడవు అయ్యిపోతుంది. ఇంకా ప్లేటు పెట్టగలిగితే ఆ అమ్మాయి తెగలు అత్యంత అందమైన వారిలో ఒకరిగా వాళ్ళ పెద్దలు పరిగణించబడతారు . ఇది వినడానికి చాలా భయంకరంగా ఉన్న వాళ్ళు ఒక సాంప్రదాయంలా ఇది ఫాలో అవుతుంటారు. అయితే ఈ పెదవి ప్లేట్ ఆచారం మొదట్లో అందం కోసం కాదు తమను తాము రక్షించుకునేందుకు ఒక మార్గంలో పుట్టింది అని వాళ్ళ పూర్వికులు చెప్తున్నారు.  శతాబ్దాల క్రితం బానిస వేటగాళ్లు ఆఫ్రికాలో అందమైన అమ్మాయిలను బలవంతంగా తీసుకెళ్లి అనుభవించే వారట . అమ్మేసేవారట . అప్పుడు తమను అశోభనకంగా చూపించేందుకు ఆ బానిసత్వం నుంచి తప్పించుకోవాలని భావనతోనే కొందరు మహిళలు ఈ విధంగా పెదవులను కోసుకొని పెద్ద ప్లేట్లు పెట్టుకుని సంప్రదాయాన్ని తీసుకొచ్చారట .



అప్పుడు మొదలైన సాంప్రదాయం ..ఇప్పటికి కంటిన్యూ అవుతుంది . ఇప్పటికి  ఆ తెగలోని అమ్మాయిలు కింద పెదవిని కట్ చేసుకొని ప్లేట్లు పెట్టుకుంటూనే ఉంటారు . ఇది మహిళలకు ఒక గౌరవంగా కూడా గుర్తిస్తూ ఉంటారు.  అంతే కాదు ఎవరైనా అలా పెదవి కట్ చేసుకుని ప్లేట్లు పెట్టుకోవడానికి నిరాకరిస్తే వాళ్ళు ఆ తెగ నుంచి బహిష్కరిస్తారట . వారు తమ సంస్కృతిని భూమిని పరీక్షించుకునేందుకు ఎటువంటి బాహ్య జోక్యాన్ని పట్టించుకోరు.  అసహ్యించుకుంటారు . అంతేకాదు ఒకవేళ ఇలాంటి సంప్రదాయాన్ని అడ్డుకోవాలని చూస్తే ఎవరైనా సరే దాన్ని తీవ్రంగా తిప్పి కొట్టడమే కాదు దానికి తగిన శిక్షణ కూడా వేస్తారట.  అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తెగలల్లో ముర్సీ తెగ కూడా పరిగణిస్తారు అంటున్నారు నిపుణులు .కొందరికి ఇది విడ్డూరంగా అనిపించొచ్చు మరికొందరికి క్రూరంగా ఉండొచ్చు మరి కొందరికి నాన్సెన్స్ మూఢనమ్మకంగా కూడా ఉండొచ్చు .. కానీ ముర్సీ తెగకు ఇది వారి స్వతంత్ర ఆత్మ గౌరవానికి గుర్తు.  అంతేకాదు ప్రతి తెగకు ప్రతి ప్రాంతానికి వాళ్లకంటూ ప్రత్యేకమైన అందం నిర్వచనం ఉంటుంది . అలాగే ముర్సి తెగకు చెందింది ఇలాంటి ఒక పద్ధతి . అందం అంటే ఒక ప్రమాణం కాదని సాంస్కృతికపరంగా ప్రతి ఒక్కరికి భిన్న భావాజాలం ఉంటుందనేది ముర్సి తెగనే మనకు చూపిస్తున్న గొప్ప పాఠం అని అంటున్నారు ప్రముఖులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: