నేటి సమాజంలో అక్రమ సంబంధాలు ఎంత మంది జీవితాలను నాశనం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్రమ సంబంధాల వల్ల భార్య భర్తల మధ్య నమ్మకం చెదిరిపోతుంది. విడాకులు, విడిపోయే పరిస్థితులు పెరుగుతున్నాయి. పిల్లలు మానసికంగా దెబ్బతింటారు. కుటుంబం పరువు బజారున పడుతుంది. కొందరైతే ఇతర వ్యక్తులతో సంబంధం పెట్టుకొని కట్టుకున్న వారిని హతమార్చేందుకు కూడా వెనకాడటం లేదు. రీసెంట్ గా జ‌రిగిన‌ మేఘాలయ హనీమూన్ సంఘటన ఇందుకు ఒక ఉదాహ‌ర‌ణ‌.


అయితే తాజాగా తన భార్య 19 ఏళ్ల కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త.. ఆమెకు ఏ విధంగా బుద్ధి చెప్పాడో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవుతాయి. ప్రియుడుతో భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త ఆమెకు అక్కడికక్కడే పెళ్లి జరిపించాడు. ఈ విచిత్ర ఘ‌ట‌న బీహార్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  సహర్సాకు చెందిన 30 ఏళ్ల ఆర్తి కుమారికి రాకేష్ కుమార్ మెహతా అనే వ్య‌క్తితో దశాబ్దం క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడు మరియు తొమ్మిది సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.


రాకేష్ లార్డ్ బుద్ధ మెడికల్ కాలేజీకి ఎదురుగా టీ స్టాల్ నడుపుతుండగా.. బాబుల్ అలియాస్ వరుణ్ ముఖర్జీ అనే 19 ఏళ్ల కుర్రాడు సమీపంలోని క్యాంటీన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆర్తి మరియు వరుణ్ మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి అక్ర‌మ సంబంధానికి దారి తీసింది. అయితే కొద్ది రోజుల నుంచి భార్య ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు గ‌మ‌నించిన రాకేష్.. గురువారం రాత్రి వరుణ్ తో ఆర్తి సన్నిహితంగా ఉండగా పట్టేసుకున్నాడు.


కుటుంబ‌స‌భ్యులు, గ్రామస్తుల స‌హాయంతో ఆ ఇద్ద‌రినీ బంధించిన‌ రాకేష్ దేహ‌శుద్ధి చేశాడు. అక్క‌డితో ఆగ‌ని రాకేష్‌.. భార్య నుదుటిపై ఉన్న సింధూరాన్ని చెరిపేసి, ఆమెకు ప్రియుడు వ‌రుణ్ తో అక్కడికక్కడే బ‌ల‌వంతంగా వివాహం జరిపించాడు. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌పై రాకేష్ మాట్లాడుతూ.. నా భార్య చేతిలో హత్యకు గురికాకుండా బయటపడ్డాను, అదే చాలు. కాక‌పోతే ఆమె నాతో పాటు నా ఇద్దరు పిల్లల జీవితాలను కూడా నాశనం చేసింది అంటూ వాపోయాడు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: