ఆంధ్రప్రదేశ్ పోలీసు వర్గాల్లో అరుదైన సంచలనం రేపిన వ్యవహారం ఇది. జీవితఖైదుగా శిక్ష అనుభవిస్తున్న కరుడుగట్టిన నేరస్తుడు శ్రీకాంత్ కు పెరోల్ తీసుకురావడమే కాకుండా, అతడిని జైలు గోడల బయటికి తెచ్చి తనతో విందులు, వినోదాలు చేసిందని బయటకు వచ్చిన వీడియోలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ – పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. పెరోల్ వెనుక అరుణ మేజిక్! శ్రీకాంత్ పై 60కి పైగా తీవ్రమైన కేసులు ఉన్నాయి. హత్య కేసులో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. 2010 నుంచి జైలులో ఉన్న అతను, 2014లో ఒకసారి తప్పించుకుని నాలుగేళ్లు పరారీలో తిరిగాడు. చివరికి లొంగిపోయి మళ్లీ జైలుకు వెళ్లాడు. అంతటి కరుడుగట్టిన నేరస్తుడికి పెరోల్ రావడం అసాధ్యం అని జిల్లా ఎస్పీలు, డీఎస్పీలు స్పష్టంగా చెప్పినా… నిడిగుంట అరుణ ఒత్తిడి, లాబీయింగ్ వల్లే జూలై 30న అతడికి పెరోల్ మంజూరైంది.


ఈ అరుణ.. ఒకప్పుడు ఎన్జీవో నడిపిన సామాజిక కార్యకర్త. ఖైదీల కోసం పని చేస్తానని చెప్పుకుంటూ జైలులో రాకపోకలు కలిగిన ఆమె, వాస్తవానికి శ్రీకాంత్ ప్రియురాలు అని మాటలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు ఆమెను అతడి భార్యే అంటున్నారు. ఆధారాలు లేవు కానీ ఆమె ప్రభావం మాత్రం ఏ స్థాయిలో ఉందో ఈ పెరోల్ డ్రామా చెప్పేస్తోంది. వీడియోలు.. పోస్టులు.. సంచలనాలు! .. పెరోల్ తో బయటకు వచ్చిన శ్రీకాంత్ తో అరుణ విందులు, సన్నిహిత క్షణాలు ఉన్న వీడియోలు బయటకు రావడం పెద్ద కలకలం రేపింది. ఇంతలోనే కారు డిక్కీలో కూర్చుని తాను తీసుకున్న సెల్ఫీ వీడియో ను అరుణ సోషల్ మీడియాలో పోస్టు చేయడం మరింత సంచలనమైంది. ఆ పోస్టులో – “మమ్మల్ని వాడుకున్నారు.. ఇప్పుడు వదిలేశారు. మా ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఇక మౌనంగా ఉండను. ఎవరి బండారమో బయటపెడతా. ఎవరైనా ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారు” అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. పెరోల్ రద్దు – అరుణ అరెస్ట్! .. ఈ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ కావడంతో, హోంశాఖ తక్షణం స్పందించి శ్రీకాంత్ పెరోల్‌ను రద్దు చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఇవ్వబడిన పెరోల్ రద్దు చేయబడిన సందర్భం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

 

ఇక అంతేకాకుండా, అక్రమ పద్ధతుల్లో పెరోల్ ఇప్పించిందన్న కారణంతో అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు శాఖలో కలకలం .. అయితే అసలైన సంచలనం పోలీసు శాఖలోనే మొదలైంది. ఒక సాధారణ ఎన్జీవో కార్యకర్తలా కనిపించే అరుణకు ఇలా అధికారులను ప్రభావితం చేసే స్థాయి ఎలా వచ్చిందన్న ప్రశ్నలు వేడెక్కుతున్నాయి. హోంశాఖలో ఉన్న సంబంధాలు, డబ్బు లావాదేవీలు లేదా మరేదైనా బలంతోనే ఈ మాంత్రికం జరిగిందా? అన్నది ఇప్పటి హాట్ డిబేట్. శ్రీకాంత్ – అరుణ పెరోల్ కథనం ఇప్పుడు ఏపీ రాజకీయాలు, పోలీసు శాఖ, మీడియా లో పెద్ద రచ్చగా మారింది. జైలు గోడల వెనుక ఉన్న నేరాలు, జైలు బయట జరుగుతున్న సంబంధాలు – ఈ రెండూ కలిసి బయటపడ్డప్పుడు ఎంత పెద్ద కలకలం రేపుతాయో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. అరుణ నోరు విప్పితే ఇంకా ఎన్ని బాంబులు పేలుతాయో? అన్నదే ఇప్పుడు అందరి కుతూహలం!

మరింత సమాచారం తెలుసుకోండి: