
కరోనా... రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. స్వీయ నియంత్రణ మాత్రమే కరోనాను జయించడానికి ఉన్న ఏకైక మార్గం. ఈ వైరస్ ఎప్పుడు, ఎవరికి, ఎలా సోకుతుందో ఎవరూ చెప్పలేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనా సోకకుండా జాగ్రత్త పడవచ్చు. కరోనాకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం, వార్తా ఛానెళ్ల ద్వారా తెలుసుకోవడం ఉత్తమం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తాయి. మహమ్మారిలా ముంచుకొస్తున్న కరోనాను సామాజిక దూరం ద్వారా మాత్రమే అంతం చేసుకోవచ్చు. కరోనాను ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లోకి కొత్త వ్యక్తులను కొన్ని రోజుల వరకు అనుమతించకపోవడమే మంచిది. ప్రతి రెండు గంటలకు తప్పనిసరిగా ఒకసారి సబ్బుతో లేదా శానిటైజర్ తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి.
కొత్త వస్తువులను ముట్టుకునేముందు తప్పనిసరిగా శానిటైజర్ ను వినియోగించాలి. ఆల్కహాల్ తో తయారైన శానిటైజర్ లను ఉపయోగిస్తే మరీ మంచిది. శానిటైజర్ ఉపయోగించటం వల్ల వైరస్ ను తాకినా ఆ వైరస్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలి. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ కచ్చితంగా ఉపయోగించాలి. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ జన సందోహం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉంటే వైరస్ భారీన పడకుండా రక్షించుకోవచ్చు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple