కరోనాను జయించడానికి బలమైన ఆహారం తీసుకోవడం ఎంతో ప్రధానం. కరోనా వైరస్‌తో పోరాడేందుకు మనకు విటమిన్లు A, B, C, D, E తోపాటూ.. మినరల్స్, ఐరన్, సెలెనియం, జింక్ తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఈ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం మన జీవన శైలిలో అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిలో క్యారెట్, ఆరెంజ్ బనానా, ఆకు కూరలు, నాన్ వెజ్ వంటి బలమైన ఆహారం తీసుకోవాలి. ఇక పోతే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు చూస్తే కరోనా ఉన్న వారిలో కళ్లు లేత గులాబీ రంగులోకి మారడం, జీర్ణాశయ సంబంధ సమస్యలు, వినికిడి సమస్య, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
కాబట్టి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకొని, ఓ వైపు బలమైన ఆహారం తీసుకుంటూనే మరో వైపు డాక్టర్ల సలహామేరకు వైద్యాన్ని తీసుకోవాలి. తీసుకున్న వైద్యం మిమ్మల్ని కొంత మేరకు కాపాడుతుంది. కానీ మీరు వ్యాధి ఉందని ఎటువంటి ఆందోళన చెందకూడదు. ఇటువంటి ఆందోళనే మిమ్మల్ని మరింత ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి మనో ధైర్యంతో ఉండాలి. ఎటువంటి భయం కలిగి ఉండకూడదు. మన ధైర్యమే మనల్ని కాపాడుతుందని గుర్తించుకోండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి