శృంగారం అనేది స్త్రీ, పురుషుల జీవితాల్లో అతి ముఖ్యమైన ఘట్టం. అయితే సెక్స్ అనేది కేవలం శారీరక తృప్తి అనుకుంటే పొర‌పాటే అంటున్నారు నిపుణులు.  కేవలం శారీరక సంతృప్తి కోసమే కాదు మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా సెక్స్ దోహదపడుతుంది. మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. ఇక  ఆనందమైన సెక్స్ ఎంత ముఖ్యమో.. ఆరోగ్యకర సెక్స్ కూడా అంతే ముఖ్యం. అయితే స్పర్శ నుంచి సంభోగం వరకు  ప్రతి సందర్భాన్ని ఎంజాయ్ చేస్తే అంతర్గత శరీరం, బాహ్య శరీరం యాక్టివ్‌గా పనిచేస్తుంది. 

 

దానివల్ల మానసిక ఉల్లాసం, శారీరక ఆనందం కలుగుతాయి. అంతేకాదు.. రోజూ శృంగారంలో పాల్గొనే వారిలో గుండె సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయంటున్నారు నిపుణులు. రోజూ సెక్స్ చేయడం వల్ల మంచి హార్మోన్లు విడుదలౌతాయని.. వాటివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంద‌ని అంటున్నారు. ఇక వయసు పెరిగే కొద్ది వృద్ధాప్య చాయలు రావడం సహజం. వాటిని త‌గ్గించుకోవ‌డానికి మ‌హిళ‌లు ఏవేవో ఫేస్ క్రీములు వాడుతుంటారు. కానీ, వారానికి రెండుసార్లు సెక్స్ చేసే మహిళలకు ప్రత్యేకించి ఫేసుక్రీములు అవ‌స‌రం లేద‌ని ఓ అధ్యయనంలో తేల్చి చెప్పింది.

 

అంటే వీళ్లు అసలు వయసు కన్నా ఏడెనిమిదేళ్లు చిన్నగా, ఆక‌ర్ష‌ణీయంగా కనిపిస్తార‌ని అంటున్నారు. అలాగే భార్యాభర్తల మధ్య సెక్స్ అనేది శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక అనుబంధం బలపడ్డానికీ కారణమవుతుంది. మ‌రియు రోజూ శృంగారంలో పాల్గొనే మహిళల్లో కటిభాగంలో కండరాలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి అని అంటున్నారు నిపుణులు. అదేవిధంగా, సెక్స్ వ‌ల్ల  గుండె కొట్టుకునే వేగం తగ్గుతుందని, రక్తపోటును నివారించవచ్చని, రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దరి చేరవని, ఒత్తిడి దూరం అవుతుందని ఇప్ప‌టికే ఎన్నో ఆధ్య‌య‌నాలు నిరూపించాయి.

  

 


   

మరింత సమాచారం తెలుసుకోండి: