ఈ రోజుల్లో చాలా మంది దంపతులకు  పిల్లలు పుట్టడం లేదు. ఇంట్లో పిల్లలు లేని లోటు ఎవరు తీర్చలేనిది. పిల్లల పుట్టాలని తిరగని గుడి ఉండదు, ఆసుపత్రి ఉండదు. అయినాగాని ఫలితం ఉండడం లేదు. అయితే ముందుగా తెలుసుకోవాలిసిన విషయం ఏంటంటే... కేవలం మందులే కాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని అంటున్నారు వైద్యునిపుణులు. సంతానలేమి సమస్య అనేది  స్త్రీ కి లేదా, పురుషుడికి ఎవరికైనా ఉండొచ్చు. చాలా సందర్భాల్లో స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ కారణం గానే ఈ సమస్య ఎదుర్కొవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి వచినప్పుడు ఆహారపు అలవాట్లలలో మార్పు చేసుకోవడం, వ్యాయామం చేయడం తో పాటు, కొన్ని ప్రత్యేక  పదార్థాలను రోజువారీ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మరి ఆ ఆహార పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం…!
 


మాములుగా నెలసరి సమస్యలు ఉన్న స్త్రీలు గర్భ సమస్యలను ఎక్కువగా ఎదురుకుంటుంటారు. ఇలాంటి వారికి అరటిపండు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. అరటికాయలో ఉండే  బి6 విటమిన్  వలన త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తీసుకునే ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు చేర్చుకోవడం వల్ల ఐరన్, ఫోలిక్ యాసిడ్, పుష్కలం గా లభిస్తుంది. దీని వల్ల గర్భధారణ సమస్యలు తగ్గుముఖం పడతాయి  . అంతేకాకుండా  బ్రొకొలీలో ఫోలిక్ యాసిడ్ తో పాటు, పోషకాలు కూడా అత్యధికంగా ఉండడం వల్ల బ్రొకొలీ గర్భం దాల్చాలనుకునే వారికి ఒక మంచి ఆహారం గా చెప్పొచ్చు.



అందుకే వీటిని ఆహారం లో చేర్చుకోవడం చాల ముఖ్యం. అలాగే దానిమ్మ పండులో శృంగారానికి సంబందించిన హార్మోన్స్‌‌ని పెంచే శక్తి ఉంటుంది. వీటిని గింజలు తినడం లేదా రసం గా తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగి శృంగారం పట్ల ఆసక్తి పెరిగేలా చేస్తుంది. పాలకూర సంతాన సాఫల్యత మెరుగుపరచడం లో మంచి పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే  ప్రత్యేకమైన విటమిన్స్ కోరికలను పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే పాలు, పాలపదార్ధాలు కూడా వీలయినంత ఎక్కువగా తీసుకోవాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: