పిల్లలు గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగి, శిఖరాలు అధిరోహించితే అంతకంటే గొప్ప సంతోషం, పెద్ద ఆనందం తల్లిదండ్రులకు ఏముంటుంది. ఎన్నో కష్టాలు పడి తమ పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రతి ఒక్క తల్లితండ్రి భావిస్తాడు. వారిని సరైన దారిలో ఉంచి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా గౌరవమర్యాదలు తగ్గుతున్న వ్యక్తిగా తీర్చిదిద్దాలని వారు కోరుకుంటారు. సహజంగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. పిల్లలు ఉన్నత స్థానాలకు వెళితే అది వారికి ఎనలేని సంతోషాలను తెచ్చిపెడుతుంది.

అయితే అలాంటి పిల్లలను తమకంటే ఉన్నత స్థితికి చేరుకుంటే, వారికిన్వారే స్వయంగా గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడితే తల్లిదండ్రుల ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఉద్యోగరీత్యా కొడుకు ను తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కూతురు కి తండ్రి సెల్యూట్ చేయడం వంటి సన్నివేశాలను మనం చూశాం. అప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు అని వారి కళ్ళల్లోని ఆనంద భాష్పాల ద్వారా తెలిసింది. 

తాజాగా ఉన్నతాధికారి అయినా తన కొడుకు కు సెల్యూట్ చేస్తూ ఎంతో మురిసిపోతుంది ఓ తల్లి.  వివరాల్లోకి వెళితే గుజరాత్ అరవపల్లి ప్రాంత డి ఎస్ పి కి ఆఫీస్ లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఎస్సై ఉన్నతాధికారి సెల్యూట్ చేస్తుంది. ఇందులో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా. అక్కడ పరస్పరం సెల్యూట్ చేసుకుంటున్నా ఆ ఇద్దరు తల్లి కొడుకులు కావడమే ఇక్కడ విశేషం. తల్లి మురిసిపోతూ కొడుకుకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం హైలెట్ గా నిలిచింది.దేశం మొత్త ఈ ఘటన ను చూడాలని ఎంతగానో ఎదురుచూస్తుంది..  దాంతో ఈ అపురూప దృశ్యాన్ని గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో ఎంతో వైరల్ గా మారింది. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: