భార్యాభర్తలకు ఓ గొప్ప అనుభూతిని ఇచ్చే భావన తల్లిదండ్రులు కావడం. ఇక గర్భం దాల్చిన ప్రతి మహిళ ఈ ప్రపంచంలోకి తాను తీసుకురాబోయే కొత్త బేబీ పట్ల చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. సాధారణంగా ఇది ఇది ఏ స్త్రీకైనా మరిచిపోలేని అనుభూతిఅనే చెప్పాలి. ఈ అనుభూతిని మాటల్లో వివరించడానికి కూడా సాధ్యం కాదు. ఇక తల్లి కావడం అనేది జీవితంలో ఎవరూ మర్చిపోలేని ఘటన అనే చెప్పాలి. మహిళ గర్భం దాల్చిన తరువాత తనకు పుట్టబోయే బిడ్డను పెంచి ప్రయోజకుడిని చేయాలనే తపన ప్రతి తల్లిలోనూ కనిపిస్తుండటం సహజమనే చెప్పాలి మరి.

అంతేకాదు.. తన గర్భంలో పెరుగుతున్న చంటి పాప ఆరోగ్యానికి, తన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు గర్భిణీ స్త్రీలు ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఇక అందుకోసం వారి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే తల్లులు ఆరోగ్యకరంగా ఉంటేనే లోపల పెరుగుతున్న చంటి పాప కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకోసమే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.

అయితే గర్భధారణ సమయంలో స్త్రీలల్లో తిమ్మిర్లు పట్టడం సహజంగానే ఉంటుంది. ఇక మన శరీరంలో వచ్చే హార్మోన్ చేంజెస్ వలన ఇలా జరుగుతుందని అనేక మంది వైద్యులు వెల్లడించారు. కాగా.. ఇవి తరుచూ వస్తూ ఉంటాయని అన్నారు. ఇక ఇలా కొన్ని సార్లు తిమ్మిర్లు తేలికగా వదులుతుంటాయి. అయితే కొన్ని సార్లు మాత్రం తిమ్మిర్లు భరించలేని నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. కాగా.. వీటి వలన ప్రెగ్నెన్సీ స్త్రీలలో మానసిక ప్రశాంతత దూరమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో తిమ్మిర్లు వచ్చినపుడు ఒక్కో సారి స్త్రీలలో చికాకు వస్తుంటుందని పేర్కొన్నారు. అయితే తిమ్మిర్లతో బాధపడేవారు కుంకుమ పువ్వును తీసుకోవడం వలన ఈజీగా ఆ సమస్యను జయించవచ్చని అనేక మంది నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: