గత మూడు నెలల నుంచి ఆటోమొబైల్ రంగం ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ విదితమే. అయితే అప్పట్లో విడుదల అవ్వాల్సిన వాహనాల సంస్థలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా భారత మార్కెట్ లో వాటి ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇకపోతే తాజాగా హోండా తన మోటార్ సైకిల్ అయిన హోండా లివో ను విడుదల చేసింది. bs 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన హోండా మోటార్ సైకిల్ ప్రస్తుతం షోరూంలలో లభిస్తోంది. ఈ బైక్ ధర రూ. 69,442 గా సంస్థ నిర్ణయించింది. ఇక ఈ బైక్ డిస్క్ డ్రం వేరియంట్లలో లభ్యం అవుతున్నాయి.

 

IHG

 

ఇకపోతే పాత మోడల్ కంటే ఎన్నో అప్డేటెడ్స్ తో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ 110 సిసి ఇంజన్ తో పని చేస్తుంది. ఇందులో ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టం సాంకేతికతతో బండి ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే ఎనహాన్సెడ్ స్మార్ట్ పవర్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్డేట్ లతో బండి పనితీరు కూడా చాలా మెరుగ్గా వచ్చింది. వీటితో పాటు సరికొత్త డిజైన్ బాడీ గ్రాఫిక్స్ లాంటి ప్రత్యేకతల వల్ల ఈ మోడల్ సైకిల్ స్పోర్ట్స్ బైక్ కనబడుతోంది. వీటితో పాటు ఈ బైక్ లో అనేక ఫీచర్లు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి.

 

IHG

 


ఇక ఇందులో కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే లివో bs6 మోడల్ లో 2 వేరియంట్స్ లో ఉన్న 4 కొత్త కలర్ ఆప్షన్ లతో అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్ కలర్, ఇంటీరియల్ రెడ్, మెటాలిక్ మాటి ఆక్సిస్ గ్రే, మెటాలిక్ అథ్లెటిక్ బ్లూ లాంటి కలర్స్ లో ఈ మోటార్ సైకిల్ ని మనము పొందవచ్చు. భారత మార్కెట్లో ఈ బైకు పోటీ గా టీవీఎస్ రేడియం, అలాగే హీరో సంస్థనుండి స్ప్లెండర్ ప్లస్ గట్టి పోటీ ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: