భారత మార్కెట్లోకి ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ ఫెరారీ సరికొత్త ఎఫ్8 ట్రిబ్యూటో కారును సైలెంట్‌గా విడుదల చేసింది. ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూనో సూపర్ కార్ ధర రూ.4.02 కోట్లుగా ఉంది. అంతేకాదు ఫెరారీ బ్రాండ్ నుంచి తాజాగా విడుదలైన మిడ్ ఇంజన్ సూపర్ కార్ కావటం విశేషం. ఇది సుప్రసిద్ధ ఫెరారీ 488 జిటిబి స్థానాన్ని రీప్లేస్ చేస్తూ విడుదలైన మోడల్.


కొత్త ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కారులో అదే 3.9-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 720 బిహెచ్‌పి శక్తిని మరియు 770 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో ఇప్పటి వరకు తాము తయారు చేయని అత్యంత వేగవంతమైన సిరీస్-ప్రొడక్షన్ మిడ్ ఇంజన్ సూపర్ కార్ అని కంపెనీ పేర్కొంది. ఎఫ్8 ట్రిబ్యూటో గరిష్టంగా గంటకు 340 కి.మీ వేగంతో దూసుకెళ్తుందని కంపెనీ తెలిపింది.


ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో దాని మునుపటి తరం మోడల్ కంటే 40 కిలోలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. 15 శాతం ఎక్కువ డౌన్‌ఫోర్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో దాని మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే చాలా పదునైన మరియు అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఫెరారీ 488 జిటిబిలోని అనేక డిజైన్ ఎలిమెట్స్‌ను కలిగి ఉంటుంది. కొత్త ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో స్టైలింగ్ అప్‌డేట్స్‌లో రిఫ్రెష్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, పదునైన క్రీజ్ లైన్స్ ఉన్నాయి. ట్రిబ్యూటో దాని మునపటి 488 జిటిబితో పోలిస్తే మరింత స్టైలిష్, స్పోర్టీగా కనిపిస్తుంది.


ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కాక్‌పిట్‌లో పలు డిజిటల్ స్క్రీన్లు, 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు పెద్ద పాడిల్ షిఫ్టర్లను కలిగి ఉంటుంది. ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో ఒక శకం ముగింపును సూచిస్తుంది. ఎఫ్8 ట్రిబ్యూటో రాకతో 488 జిటిబి మోడల్ నిలిచిపోనుంది.ఫెరారీ ఉత్పత్తి చేసే చివరి హైబ్రిడ్ కాని మిడ్-ఇంజిన్ V8 పవర్డ్ సూపర్ కార్‌గా ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో చరిత్రలో నిలిచిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: