పండగ సీజన్ రావడంతో ఆటోమొబైల్ సంస్థలు కస్టమర్లను ఆకర్షించడానికి ప్రత్యేక డిస్కౌంట్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా మహీంద్రా యొక్క ప్రధాన ఎస్‌యూవీకి చెందిన మహీంద్రా ఆల్టురాస్ జీ4 వెహికిల్ పై అత్యధికంగా 3.06 లక్షల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. దీనిలో 2.4 లక్షల నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కింద రూ.50,000 యాక్ససరీస్ కింద రూ.20,000, కార్పొరేట్ ఆఫర్ కింద రూ.16,000 వంటివి ఉన్నాయి. ఎంట్రీ లెవల్ టూ-వీల్ డ్రైవ్, ఫుల్లీ లోడెడ్ ఫోర్-వీల్ వేరియంట్ వంటి రెండు ఎస్యూవీ మోడల్ లలో అల్టురాస్ లభిస్తుంది.

ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న 7 సీట్ల ఎస్‌యూవీలలో ఒకటిగా పేరుపొందిన ఎక్స్‌యూవీ 500 2.2-లీటర్ల డీజిల్ ఇంజన్ తో వస్తుంది. అంతేకాకుండా మహీంద్రా ఎక్స్యూవీ యొక్క డబ్ల్యూ 5, డబ్ల్యూ 7 వేరియంట్‌లకు రూ .55,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్‌యూవీ 500  డబ్ల్యూ 9, డబ్ల్యూ 11 మోడళ్లకు రూ .57,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మహీంద్రా లైనప్‌లోని ఓల్డ్ మోడళ్లలో XUV 500 ఒకటి. అయితే మరాజో ఎమ్‌పివి బిఎస్ 6 ఎమిషన్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడిన మోడల్ ని రూపొందించారు. దీని ఎం4+, ఎం6+ వేరియంట్లపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది. ఇక రూ .15 వేల ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ .6,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ .5 వేల విలువైన యాక్ససరీస్ వంటి ఆఫర్లను అందిస్తారు.. XUV300 మోడల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో రూ .30,000 డిస్కౌంట్లతో లభిస్తుంది. ఇందులో రూ. 25 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయని తెలిపారు.


అంతేకాక మహీంద్రా లైనప్ నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన SUV లలో బొలెరో ఒకటి అని చెప్పాలి. ఇది BS6 కంప్లైంట్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది కేవలం క్రాష్ టెస్ట్ కంప్లైంట్ మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. బొలెరో కొనుగోలుదారులకు రూ .20,500 డిస్కౌంట్‌తో రూ .6,500 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిపై రూ .10,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ .4,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ వంటివి లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: