ఓలా, ఊబ‌ర్ 20 శాతం క‌మీష‌న్ తీసుకుంటున్నార‌ని... దాన్ని 5 శాతంకు త‌గ్గించాల‌ని క్యాబ్ డ్రైవ‌ర్ అసోసియేష‌న్ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తోంది. బండి ఇన్సూరెన్స్ తామే డబ్బులు క‌ట్టాల్సి వ‌స్తోంద‌ని, డీజీల్ ధ‌ర అధికంగా పెరిగిపోయింద‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం త‌మ‌ను ఆర్థిక ఆదుకునేందుకు ఒక్కో డ్రైవ‌ర్కు రూ.7,500 చెల్లించాల‌ని కోరారు. బోర్డ‌ర్ ట్యాక్స్, ఫిట్నెస్ ట్యాక్స్ను మాఫీ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో ఐటీ సంస్థ‌ల ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వ‌హిస్తున్నార‌ని... ఐటీ సంస్థ‌ల్లో ఉన్న 33 వేల వాహ‌నాలు గ‌త నాలుగు నెల‌లుగా రోడ్డెక్క‌లేద‌ని.. వీటిపైనే ఆధార‌ప‌డ్డ క్యాబ్ య‌జ‌మానులు, డ్రైవ‌ర్లు వాపోయారు.


దేశ రాజధానిలో క్యాబ్ సర్వీసులు సుమారు 2 లక్షల మంది డ్రైవర్లు సమ్మె కు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వారు చేసిన విజ్ఞప్తులను వినిపించడం లేదు అని, ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని సమ్మెకు దిగినట్లు సర్వోదయ డ్రైవర్స్ అసోసియేషన్ ఢిల్లీ అధ్యక్షుడు కమల్జీత్ సింగ్ గిల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: