మగువలు అందంగా ఉండాలని ఎన్నో రకాల కాస్మెటిక్స్, క్రీమ్స్ తోపాటు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. అంతేకాకుండా మార్కెట్లో దొరికే ఎన్నో రకాల లోషన్స్ ని కూడా వాడుతుంటారు. అయితే ఇవన్నీ తాత్కాలికమే. కొంతకాలం వరకే అందాన్ని ఇచ్చే ఈ కాస్మెటిక్స్ పై  చాలా మంది మక్కువ చూపుతున్నారు. అయితే వీటిలో కలిపే కెమికల్స్ వల్ల చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ముడతలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వాటి అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టే సమయం రానే వచ్చింది.కేవలం వంట సోడా  ను ఉపయోగించి, మన చర్మాన్ని ఏ విధంగా అందంగా మార్చుకోగలమో  ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

వంట సోడా ద్వారా తయారుచేసుకునే సహజసిద్ధమైన బ్యూటీ టిప్స్ ట్రై చేయడం వల్ల చర్మానికి  ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా మనం ఎప్పుడైనా ఎండలోకి వెళ్లినప్పుడు మనల్ని కాపాడేందుకు చర్మం  మెలనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది.అందువల్ల ముఖానికి గ్లో  పోవడం జరుగుతుంది. ఇలా వచ్చిన మెలనిన్ ను  సహజసిద్ధంగా పోగొట్టే లక్షణం కేవలం తినేసోడాలో మాత్రమే ఉంది.

 ఒక టేబుల్ స్పూన్ తినేసోడా, అందులో ఒక టేబుల్ స్పూన్ నీరు, ఒక  టేబుల్ స్పూన్ వెనిగర్ అన్నీ కలిపి  పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి,ఒక గంట సేపు ఆరనివ్వాలి.మొదటగా మనం తెల్లగా అప్లై చేసిన పేస్ట్ కాస్త బ్రౌన్  కలర్ లోకి మారడం గమనించవచ్చు.  ఫలితంగా చర్మం పై నున్న మెలనిన్ తొలగిపోయి చర్మం సహజ సిద్ధంగా మృదువుగా మారుతుంది.

తినేసోడాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద, మంటలు,చర్మం ఎర్రబడి పోవడం లాంటి సమస్యల నుంచి బయట పడేలా చేస్తుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో, ఒక టేబుల్ స్పూన్ తినే సోడా కలిపి ఐదు నుండి పది నిముషాలు మీడియం మంట మీద ఉడికించాలి. ఈ పేస్టును రోజుకు రెండుసార్ల చొప్పున రాసుకుంటే చర్మం మృదువుగా ప్రకాశవంతంగా తయారవుతుంది.అంతేకాకుండా మచ్చలు,మృత కణాలు లాంటివి తొలగిపోవడంతో ఎంతో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: