బొప్పాయి, తేనె కలిపి ఫేస్ ప్యాక్‌లా తయారు చేసి అప్లయ్ చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి జిడ్డుని తగ్గించి చర్మాన్ని అందంగా మారుస్తుందట.చర్మ గ్రంథుల నుంచి విడుదలయ్యే నూనెను తగ్గించే గుణం శనగపిండి, పాలు, తేనెకు ఉన్నాయట.ఐస్‌ క్యూబ్స్ తో ముఖాన్ని రబ్‌ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుందట. ముఖంపై జిడ్డును పూర్తిగా తొలగించే ఆయిట్ బ్లోటింగ్ షీట్ ను నిత్యం మీ వెంట తీసుకెళ్తుండాలి.ఆయిల్ స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజింగ్ క్లెన్సర్‌ ఉపయోగిస్తే అది చర్మంపై పేరుకుపోయే జిడ్డును తొలగిస్తుంది. రోజ్ వాటర్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.రోజ్ వాటర్‌లో కాటన్ బాల్ ముంచి ఫేస్‌కి అప్లయ్ చేస్తే జిడ్డుని పూర్తిగా తొలగిస్తుంది. జిడ్డు చర్మం ఉండే వారికి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ చక్కగా పని చేస్తుంది. పింపుల్స్‌ తొలగించడంలోనూ సమర్థవంతంగా పని చేస్తుంది. నారింజ లేదా కమలా పండు తొక్కతో ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే ముఖంపై జిడ్డు తగ్గుతుంది.


జిడ్డు చర్మం ఉండే వారు ఎక్కువగా మేకప్ వేసుకుంటే మొటిమలు పగిలి చర్మం అంతా పాడైపోతుంది. కాబట్టి తక్కువ మేకప్ వేసుకోవడం మంచిది.చర్మంపై అదనపు జిడ్డు పోవాలంటే దూదె పింజెని ఫ్రెష్ లెమన్ జ్యూస్‌లో ముంచి ముఖానికి అప్లయ్ చేయాలి. ముఖం కడుగుకునేటప్పుడు చల్లని, వేడి నీటికి బదులుగా గోరు వెచ్చని నీరు ఉపయోగిస్తే ముఖంపై జిడ్డుని, మురికిని అద్భుతంగా తొలగిస్తుంది. కొంతమంది జిడ్డును తొలగించేందుకు రోజుకి నాలుగైదు సార్లు ఫేష్ వాష్ ఉపయోగించి ముఖం కడుగుతారు. కానీ రోజుకు ఒకట్రెండు సార్లు తప్పకుండా చెయ్యాలి. అప్పుడే రిజల్ట్ ఉంటుందట.ఇక కొన్ని సబ్బుల్లో ఈ సోడియం క్లోరైడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి.. జిడ్డు చర్మం ఉండేవారికి ఈ సోడియం క్లోరైడ్ కలిసిన సబ్బుల వల్ల చర్మ సమస్యలు ఎక్కువవుతాయి. ముఖంపై మొటిమలు వంటివి వచ్చి చికాకు పెడతాయి. ఇటువంటి సబ్బుల వల్ల మీ జిడ్డు తొలగిపోదు సరికదా చర్మం మరింత  పాడవుతుంది. కాబట్టి మంచి సబ్బులని వాడటం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: