అందంగా కనిపించడానికి చాలా మంది ఫేషియల్స్, ఫేస్ వాష్, క్రీములు, సబ్బులు ఇలా చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అలాగే బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎక్కువ ఖర్చు చేయడానికి బదులుగా మనకు చాలా సులభంగా దొరికే తేనెను వాడడం వల్ల ముఖం చాలా అందంగా కాంతివంతంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.తేనెలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చర్మ ఆరోగ్యానికి తేనె ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మందికి తేనెను చర్మానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉండే వెంట్రుకలు తెల్లబడతాయనే సందేహం ఉంది. కానీ తేనెను చర్మానికి రాసుకోవడం వల్ల వెంట్రుకలు తెల్లబడవు అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక అపోహ మాత్రమేనని తేనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది తప్ప ఎటువంటి హానిని కలిగించదని వారు చెబుతున్నారు. జిడ్డు చర్మం, బయట ఎక్కువగా తిరిగే వారు అయితే తేనె రాసుకోవడానికి ముందుగా ముఖానికి 2 లేదా3 చుక్కల కొబ్బరి నూనె రాసుకుని ముఖానికి ఆవిరి పట్టుకోవాలి.


ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. ఇలా ఆవిరి పట్టుకున్న తరువాత తుడుచుకుని తేనెను రాసుకుని అరగంట పాటు ఉంచుకుని శుభ్రం చేసుకోవాలి. తేనెలో ఉండే పోషకాలన్నీ కూడా ఇన్ స్టాంట్ గా చర్మానికి అందుతాయి. దీంతో చర్మం రంగు పెరుగుతుంది. చర్మంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. అయితే ప్రస్తుత కాలంలో మనకు మార్కెట్ లో కల్తీ తేనె ఎక్కువగా లభిస్తుంది. కల్తీ తేనెను వాడడం వల్ల ఆశించిన ఫలితం రాకపోగా చర్మ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి స్వచ్చమైన తేనెను వాడినప్పుడు మనం ఆశించిన ఫలితం దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు.నేరుగా తేనెను తీసుకుని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.తేనెను ముఖానికి రాసుకుని మర్దనా చేసుకోవడం వల్ల ముఖం అందంగా, మెరుస్తూ కాంతివంతంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించాలని కోరుకునే ప్రతి ఒక్కరు ఇలా తేనేతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: