తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉందంటేనే చెణుకులు, ఛ‌లోక్తులు, కౌంట‌ర్లు ఉంటాయి. ఆదివారం రాత్రి ప్రెస్‌మీట్ పెట్టి లాక్‌డౌన్ 7వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు చెప్పిన కేసీఆర్ కొంద‌రు ఆర్థిక మేథావుల‌పై సెటైర్లు వేశారు. గ‌త ప్రెస్‌మీట్లో తాను హెలీకాఫ్ట‌ర్ మ‌నీ విధానం గురించి చెప్పాన‌ని.. దీనిపై కొంద‌రు ఆర్థిక వేత్త‌లు ర‌క‌ర‌కాలుగా స్పందించార‌ని... కొంద‌రు ఇది సూప‌ర్‌.. దీనికి మించింది లేదంటే.. మ‌రి కొంద‌రు ఇది వేస్ట్ అన్నార‌ని కేసీఆర్ చెప్పారు.

 

ఈ ఆర్థిక వేత్త‌ల్లో కొంద‌రు మేథావులు ఉంటార‌ని... కొంద‌రికి ఏం అర్థం కాద‌ని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భార‌త‌దేశ విత్త‌విధానం కేంద్రం ఆధీనంలో ఉంది.. దీనిపై రాష్ట్రాల‌కు అధికారం లేదు... అందువ‌ల్ల ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని... ఈ విష‌యంలో కేంద్రం వెంట‌నే జోక్యం చేసుకుని రాష్ట్రాల‌కు సాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. లేక‌పోతే ఆర్థిక రంగంలో రాష్ట్రాలు మ‌రిన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని కేసీఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: