కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులపై వరాలు కురిపించారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ఎన్నో నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం రాష్ట్రాలకు 6700 కోట్ల రూపాయలను వర్కింగ్ కేపిటల్ కింద కేటాయిస్తున్నామని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికే బట్వాడా చేశామని అన్నారు.
వ్యవసాయ రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నామని... మే 31వ తేదీ వరకు వడ్డీ రాయితీ పొడిగింపు ఇస్తున్నామని తెలిపారు. కిసాన్ కార్డులు ఉన్న రైతులకు 25,000 కోట్ల రూపాయల రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. రైతులకు 25 వేల కోట్ల నాబార్డు రుణాలు రీఫైనాన్స్ చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు,
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి