ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు పెంచలేదు అని లాక్ డౌన్ కారణంగా రెండు నెలలు గా అందరూ ఇళ్ళల్లోనే ఉన్నారు అని అందుకే కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చాయని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. కరెంట్ బిల్లులు పెంచాం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, విద్యుత్ చార్జీలు పెంచారనే ఆరోపణ అసత్య ప్రచారం అని అన్నారు. 

 

వాడిన దానికే కరెంట్ బిల్ వస్తుంది అని, కరెంట్ బిల్లులు చెల్లించే విషయంలో ఎవరి మీద ఒత్తిడి లేదని, జూన్ నెలాఖరు వరకు వాటిని చెల్లించవచ్చు అని బాలినేని స్పష్టం చేసారు. విడివిడి గానే మార్చ్ ఏప్రిల్ నెల బిల్లులు వచ్చాయన్నారు. కాగా ఇటీవల విద్యుత్ చార్జీలు భారీగా రావడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ లో పనులు లేక చస్తుంటే వీటిని ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: