తెలంగాణాలో ఇంటర్‌ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌, సమాధాన పత్రాల స్కానింగ్‌ కాపీలు పొందేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పెంచుతున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. నిన్నటి తో గడువు ముగుస్తున్న నేపధ్యంలో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రెండు మూడు రోజుల నుంచి ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ పని చేయడం లేదు. 

 

దీనితో పలువురు విద్యార్ధులు బాగానే ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇద్దరు అధికారులు కూడా ఇంటర్ బోర్డ్ లో కరోనా బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో సిబ్బంది విధుల విషయంలో  అత్యవసరం అయితేనే విధులకు హాజరు కావాలని కార్యాలయ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలో గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: