దేశంలో ఇప్పుడు కరోనా పేరు చెబితే భయంతో వణికిపోతున్నారు. చిన్నా పెద్ద.. ధనిక బీదా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ చుట్టేస్తుంది ఈ మాయదారి కరోనా. ఇక ఈ కరోనాతోనే నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు ప్రకృతి విపత్తులు కూడా మొదలయ్యాయి. తుఫాన్లు, భారీ వర్షాలతో కాల్వలు, చెవులు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా తాండూరులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నా వంతెన తెగిపోయింది. నియోజకవర్గంలో భారీ వర్షం కురవడంతో కాగ్నా నది వరద నీటితో పొంగి పొర్లుతున్నది.  ఇక్కడ నదిపై నిర్మించిన ఉన్న కొడంగల్‌-తాండూరు బ్రిడ్జి తెగిపోయింది.

 

ఈ నేపథ్యంలో తాండూరు, కొడంగల్‌ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కురియడంతో తాండూరు నియోజకర్గంలోని పంట పొలాలు నీటమూనిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. గత మూడు నాలుగు రోజలు నుంచి వరుసగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వవరకు భారీ వర్షం నమోదయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... బయటకు వెళ్లేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: