ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కైకాల స‌త్య‌నారాయ‌ణ కుమారుడు, కేజీఎఫ్ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ కైకాల రామారావుకు ఫోన్ చేసి ఆరోగ్య ప‌రిస్థితిపై వాక‌బ్ చేసారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి నిత్యం ఆయ‌న ఆరోగ్యంపై మానిట‌రింగ్ చేస్తున్న విష‌యం తెలిసిన‌దే. కైకాల ఆరోగ్య ప‌రిస్థితి ఏవిధంగా ఉంద‌నే విష‌యాన్ని తెలుసుకున్న జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వం త‌రుపున ఏమైనా సాయం కావాలంటే అడ‌గాల‌ని, ఎలాంటి స‌హాయం చేయ‌డానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని ధైర్యం చెప్పారు. అదేవిధంగా ఏపీ ప్ర‌భుత్వం త‌రుపున ఐఏఎస్ అధికారి వ‌చ్చి కైక‌లా స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంద‌ని వాక‌బు చేయ‌నున్నారు.
 
ఏపీ ప్ర‌భుత్వం త‌రుపున ఇప్ప‌టికే మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే, మంత్రి పేర్నినాని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కైకాల‌ను ప‌రామ‌ర్శించి ఆరోగ్య‌ప‌రిస్థితి ఏవిధంగా ఉంద‌ని కుటుంబ స‌భ్యుల‌ను కూడా తెలుసుకున్నారు.  అదేవిధంగా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు కూడ కైకాల కుమారుడు చిన‌బాబుతో  ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. తెలుగు సినీ న‌టుడు రావు ర‌మేష్‌, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ య‌ష్‌, మరొక స్టార్ హీరో శివ‌రాజ్‌కుమార్‌, తెలుగు సీనియ‌ర్ హీరోలైన నంద‌మూరి బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు త‌దిత‌రులు కైకాల కుమారుడు రామారావుకు ఫోన్ చేసి వాక‌బు చేసి ధైర్యం చెప్పారు. స‌త్యానారాయ‌ణ‌ కోలుకుంటున్నార‌ని, ద‌య‌చేసి ఎలాంటి పుకార్ల‌ను సృష్టించి.. కైకాల అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురిచేయొద్ద‌ని కుటుంబ స‌భ్యులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: