నాలుగు రోజుల పాటు ఎక్మోపై కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందారు సిరివెన్నెల సీతరామ‌శాస్త్రి. ఈ నెల 24న ఆసుప‌త్రిలో చేరారు. ఇవాళ మృతి చెందిన సిరివెన్నెల నాలుగేండ్ల నుంచి లంగ్ క్యాన్స‌ర్‌, బైపాస్ స‌ర్జ‌రీ కూడా చేసాం. క్యాన్స‌ర్‌, కిడ్ని ఫెయిల్యూర్‌, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ కు  ట్రీట్‌మెంట్ ఇచ్చిన‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు.  రేపు ఉద‌యం 5 గంట‌ల‌కు ఫిలించాంబ‌ర్ కు సిరివెన్నెల‌ పార్థివ దేహం త‌ర‌లించ‌నున్నారు.  మ‌ధ్యాహ్నం త‌రువాత మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

కిమ్స్ ఆసుప‌త్రి వ‌ద్ద ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సిరివెన్నెల కుటుంబ స‌భ్యుల‌కు సంతాపాన్ని ప్ర‌క‌టించారు. సిరివెన్నెల మృతి వార్త తెలుసుకున్న త‌రువాత మెగాస్టార్ చిరంజీవి కిమ్స్ ఆసుప‌త్రికి చేరుకుని మృత‌దేహాన్ని చూసారు. సీతారామ‌శాస్త్రీ లేర‌నే వాస్త‌వాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని ప్ర‌క‌టించారు ప‌లువురు. సిరివెన్నెల మ‌న‌కు ఇక లేరు అని, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: