శ్రీశైలం డ్యామ్‌ భద్రత కోసం నియమించిన పాండే కమిటీ కొన్ని ప్రమాద నివారణ సలహాలు ఇచ్చింది. దీని ప్రకారం.. వరద అంచనాను బట్టి, ముందుగానే డ్యాంలోని నీటిని ఖాళీ చేయాలట. అలాగే అదనపు స్పిల్‌వేను సాధ్యమైనంత త్వరగా నిర్మించాలట. వరద నీటిని కుందూ లాంటి పక్క బేసిన్‌కు మళ్లించాలట. ప్రస్తుత డ్యాం గరిష్ఠ నీటిమట్టం 892 అడుగులుగా ఉంది. దాన్ని మరింత పెంచాలట. ఈ నాలుగు పనులూ కలిపి చేయాలట. ఇలా చేయడం ద్వారా డ్యామ్ భద్రతను కాపాడవచ్చని పాండే కమిటీ చెబుతోంది. శ్రీశైలంలోని కొంత వరదను కుడివైపు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా చెన్నై తాగునీటికి ఇవ్వవచ్చని.. అలాగే ఇతర ప్రాజెక్టులకు మళ్లించవచ్చని పాండే కమిటీ సూచిస్తోంది. ఎడమవైపున ఎగువ భాగంలో నీటిని మళ్లించడానికి అనువైన ప్రాంతం ఉందని కూడా పాండే కమిటీ సూచించింది. ఈ సూచనలు ఎంత వరకూ అమలు అవుతాయో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: