విశాఖపట్నంలో  జగన్ సర్కారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. అందుకోసం కొండల్ని పిండిచేయడం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే రిషి కొండ తవ్వకాలపై మీడియాలో రచ్చ జరుగుతోంది. తాజాగా ఈ విశాఖపట్నం వద్ద రిషి కొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ జగన్ సర్కారుకు షాక్ ఇచ్చింది. ఈ తవ్వకాలపై ఎన్‌జీటీ స్టే ఇచ్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజు గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్ పై ఈనెల 6న మరోసారి విచారణ జరిపిన ఎన్జిటి బెంచ్... ఈ తీర్పు ఇచ్చింది.


అంతే కాదు.. ఇప్పటివరకు జరిపిన తవ్వకాలపై అధ్యయనం చేసిందుకు ఎన్జీటీ సంయుక్త కమిటీని నియమించింది. నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ఆధారిటీ, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ ఆధారిటి, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ అధికారులతో కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ ఆధారిటి నోడల్ ఏజెన్సీ గా వ్యవహారిస్తుంది. ఈ కమిటీ నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: