మంత్రి ఉషశ్రీ చరణ్‌ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా మంత్రి ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ ఓ గ్రామంలో వేరుశనగ పంటలో కలుపుతు తీస్తున్న మహిళలతో కలిసి కాసేపు కలుపు తీశారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం కనుకూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, స్త్రీ  సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ వెళ్లారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందుతున్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు.

తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన వేరుశెనగ పొలంలో కలుపు తీస్తున్న వారిని పరామర్శించారు. ఓటు ఎవరికి వేస్తారు.. వైకాపా గుర్తు ఏంటని.. ప్రశ్నించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు కొంతసేపు వేరుశనగ పంటలో మంత్రి కలుపు తీశారు. జగనన్న మన కోసం ఎన్నో చేస్తున్నాడని.. ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఆ కూలి మహిళలకు గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: