అమరావతి పాదయాత్రపై మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి రైతులది పాదయాత్ర కాదు రియల్ ఎస్టేట్ యాత్ర అని మండిపడ్డారు. మేము తలుచుకుంటే ఐదు నిమిషాల్లో రైతుల పాదయాత్ర ఆపుతామని అని నిన్న అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే నేను అసలు భయపడనన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. యాత్రను ఎలా ఆపగలమో చూస్తారా .. ముందే అన్ని మీకు చెప్పి చేయం అంటూ ఫైర్ అయ్యారు.

అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని... రెండు మూడు ఛానెల్స్ నాపై ప్రచారం చేస్తే నేను బెదరనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేస్తున్నామన్న మంత్రి బొత్స సత్యనారాయణ... పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులది త్యాగం తప్ప... అమరావతి రైతులు చేసింది త్యాగం ఎలా అవుతుందని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: