తెలంగాణలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు ప్రస్తుతం శీల పరీక్ష ఎదుర్కొంటున్నారు. తామంతా చిత్తశుద్దితో పని చేస్తున్నామని వారు చెప్పుకోవాల్సి వస్తోంది. వీరంతా త్వరలో మరో పార్టీలో చేరతారని ఓ ప్రధాన పత్రికలో వార్త రావడంతో కలకలం రేగింది. తమను ఎల్లో కాంగ్రెస్‌ అని అంటూ బ్యానర్‌ ఐటమ్‌ రాయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా తిరిగి టీడీపీలోకి వెళుతున్నట్లు రాయడం దారుణమని వారు వ్యాఖ్యానించారు. ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీకి పని చేసే వాళ్లం కాదని వారు స్పష్టం చేశారు.


వైసీపీ పార్టీ నాయకులు టీడీపీతో ఏపిలో ఉండే రాజకీయ వైరుధ్యాన్ని తమపై ఎందుకు రుద్దుతారని ఆ నేతలు ప్రశ్నించారు. తాము టీడీపీ నుంచి అధికార పార్టీ లోకి వెళ్ళలేదని, ప్రతిపక్షంలోని కాంగ్రెస్‌లోకి వచ్చామని వారు గుర్తు చేశారు. ఇలాంటి  తప్పుడు రాతలు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పత్రిక తెలంగాణలో కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేస్తోందని, ఏపీలో జగన్ కు చంద్రబాబుపై ఉన్న అక్కసును ఇక్కడ తమపై చూపుతున్నారని వారు ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: