మాలావత్ పూర్ణ తర్వాత మరో తెలంగాణ గిరిజన బాలిక.. రాష్ట్ర కీర్తి పతాకను ఎగరేయనుంది. దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వత అధిరోహణ చేయబోతోంది. కామారెడ్డి జిల్లా చెందిన గిరిజన విద్యార్థిని బానోతు వెన్నెలకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అండగా నిలిచారు. 3 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. ఈనెల 19 నుండి కిలిమంజారా పర్వత అధిరోహణ వెళ్లనుంది.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారం పేట గ్రామం అనే గిరిజన కుటుంబం నుంచి వెన్నెల వచ్చింది. చిన్నతనం నుండి పర్వత అధిరోహణ చేయడం ఇష్టం. ఈనెల 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో (5895) మీటర్ల పర్వతాన్ని అధిరోహించనుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ (8840) మీటర్ల  పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని బానోతు వెన్నెల చెబుతోంది.  బానోతు వెన్నెలకు భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని ఎంపీ సంతోష్‌ కుమార్‌ భరోసా ఇచ్చారు. పూర్ణలా బానోతు వెన్నెలకూడా  తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: