
తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ దర్యాప్తును చేయించాల్సి ఉన్న అదీ పట్టించుకోలేదు. వైసీపీ నాయకులు మనకెందుకులే లోకల్ నాయకులు ఇందులో ఉన్నారని వదిలేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైఎస్ వివేకా హత్య కేసులో అసలు నిందితులు సీబీఐ రంగంలోకి దిగితే కానీ అరెస్టు కాలేని పరిస్థితి. టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాలు ఈ కేసును చాలా లైట్ గా తీసుకున్నాయి. హత్య జరిగిన ప్రాంతంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడా.. వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడా అనే అంశం ప్రస్తుతం ఒక కాగితంపై ఆధారపడి ఉంది.
చనిపోయిన ప్రాంతంలో దొరికిన కాగితం పై ఎవరి వేలిముద్రలు ఉన్నాయనే వివరాలు సీబీఐ సేకరించనుంది. ఫింగర్ ప్రింట్స్ కాగితంపై ఎవరెవరివి ఉంటాయనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి లను కూడా ఇందులో విచారించే అవకాశం కనిపిస్తోంది. కానీ వివేకా హత్య కేసులో ఇన్ని ట్విస్టులు ఉంటాయని ఎవరూ అనుకోలేదు. దీనికి సంబంధించి చాలా రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడాలు, బంధువుల మధ్యనే తగాదాలు రావడం, సుప్రీంకోర్టు అవినాష్ ను అరెస్టు చేయొద్దని చెప్పడం, ఇలా వైఎస్ కుటుంబంలో ఈ హత్య కేసు ఆరని చిచ్చులా తయారైంది. ఇప్పటికైనా ఈ కేసు విషయంలో దోషులెవరనేది తేలుతుందా లేదా చూడాలి.