ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. తనను ఓడించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కో నియోజకవర్గంలో 70వేల బోగస్ ఓట్లకు కుట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ జరుగుతోందని అన్నారు. ఒక సెగ్మెంట్ ఓట్లు మరో సెగ్మెంట్ లోకి వెళ్తున్నాయని... ఇతర రాష్ట్రాల వ్యక్తులతో తెలంగాణలో ఓట్లు వెయిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.


మహారాష్ట్ర, కర్ణాటక వ్యక్తుల ఓట్లు తెలంగాణలో నమోదయ్యయన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉమ్మడి రంగారెడ్డి లో ఎక్కువగా దొంగ ఓట్లు పెరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోషామహల్ సెగ్మెంట్ లో ఓట్లు తగ్గుతున్నాయని.. మిగతా సెగ్మెంట్లలో పెరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: