తెలంగాణలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారు, మద్యం, డ్రగ్స్ దొరికాయి. రెండు రోజుల్లో పట్టుబడిన మొత్తం విలువ 12 కోట్లకు పైగా ఉంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న దాంట్లో మొత్తం నగదు 20.43 కోట్ల రూపాయలు. రెండు రోజుల్లో 31.36 లక్షల విలువైన, ఇప్పటి వరకు 86.92 లక్షల రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లోనే 67.64 లక్షల విలువైన, ఇప్పటి వరకు 89.02 లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.


 ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు 31 కిలోలకు పైగా బంగారం దొరికింది. 350 కిలోల వెండి, 42 క్యారట్ల వజ్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం 14.65 కోట్లు ఉంటుందట. 24 కిలోల బంగారం, 42 క్యారట్ల వజ్రాలు గత రెండు రోజుల్లో  స్వాధీనం చేసుకున్నవే.


మరింత సమాచారం తెలుసుకోండి: