
తెలంగాణలో 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి 21686 వీల్ ఛైర్స్ సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 1,85,000 మంది పోలింగ్ సిబ్బంది, 22,000 మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్ మొత్తం కలిపి రెండు లక్షలకు పైగా పోలింగ్ విధుల్లో ఉంటారు.