తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పోలింగ్ జరగనుంది. పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధం అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కాసేపట్లో ప్రారంభంకానుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3,803 సెక్టార్లలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
చేశారు. మొత్తం 27,051 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణ చేశారు. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న 7,571 చోట్ల బయట కూడా వెబ్‌కాస్టింగ్‌ చేస్తున్నారు.


పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిషేధించారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరగనుంది. 13 నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అదే రోజు మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: