ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్ వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. నిన్న తెలంగాణ పోలీసులు ఎన్నికల హడావిడిలో ఉంటే.. ఏపీ పోలీసులు వచ్చి డ్యాంలోని తమ భాగం అంటూ కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. తాగునీటి కోసం అంటూ కొంత నీరు కూడా విడుదల చేసుకున్నారు. వారి ప్రయత్నాన్ని తెలంగాణ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై కొనసాగుతున్న పోలీస్ పహారా కొనసాగుతోంది.


కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ పాటించలేదని తెలంగాణ పోలీసులు అంటున్నారు. ఏపీ వైపు ఏపీ పోలీసులు భారీగా మోహరించారు. అటు తెలంగాణ పోలీసులు కూడా డ్యాంకు భారీగా చేరుకుంటున్నారు. ఇవాళ ఐజీ స్థాయి అధికారులు సాగర్ చేరుకొని పరిస్థితి అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం 522 అడుగుల చేరువలో సాగర్ నీటి మట్టం.. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: