ఇటీవల దాదాపు రెండు నెలల పాటు రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు.. బయటకు వచ్చిన తర్వాత దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. ముందుగా ఆరోగ్యం సరి చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు దేవుళ్ల బాట పట్టారు. ఇటీవలే ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోనున్నారు.


ఈ ఉదయం 10గం. కు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అలాగే రేపు సింహాద్రి అప్పన్నను సతీ సమేతంగా దర్శించుకోనున్నారు. ఆ తరవాత ఈనెల 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు దర్శించుకోనున్నారు. అంతే కాదు.. ఆ తర్వాత వీలును బట్టి కడప అమీన్ పీర్ దర్గా, గుణదల మేరీమాత చర్చిలను కూడా చంద్రబాబు దర్శించుకోనున్నారు. మొత్తానికి జగన్ సర్కారు పెట్టిన వరుస కేసుల కారణంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడిన చంద్రబాబు.. ఇప్పుడు కాస్త ఊరట చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: