తెలంగాణ మంత్రుల్లో ఎందరు నెగ్గుతారు.. ఎందరు ఓడతారనే చర్చ కూడా నడుస్తోంది. కరీంనగర్‌లో పోటీ చేసిన మంత్రి గంగుల కమలాకర్‌, ఖమ్మంలో పోటీ చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, సనత్‌నగర్‌ నుంచి పోటీ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లలో ఎవరు విజేతలవుతారో చూడాలి.


అలాగే బాల్కొండ నుంచి పోటీ చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మహేశ్వరం నుంచి పోటీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ధర్మపురి నుంచి పోటీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పాలకుర్తి నుంచి పోటీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మేడ్చల్‌ నుంచి పోటీ చేసిన మంత్రి మల్లారెడ్డి, నిర్మల్‌ నుంచి పోటీ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సూర్యాపేట నుంచి పోటీ చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి, వనపర్తి నుంచి పోటీ చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డిల భవితవ్యం ఏంటో కొన్ని గంటల్లో తేలబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: