బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుపానుగా మారుతోంది. రేపు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. తుపాను పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. తుపాను పరిస్థితులు నేపథ్యంలో సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు.


కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే తక్షణం పునరుద్ధరణ కు   అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం..  తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్.. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలని, ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. 8 జిల్లాలకు ముందస్తుగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: