ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చిరించింది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను తీవ్రతుఫాన్ గా బలపడిందని గంటకు 8 కి.మీ వేగంతో కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  ప్రజలను హెచ్చిరించింది.
ప్రస్తుతానికి చెన్నైకి 90 కి.మీ, నెల్లూరుకు 140 కి.మీ, బాపట్లకు 270 కి.మీ, మచిలీపట్నానికి 300కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని.. ఈ రేపు ఉదయం  నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనుందని హెచ్చిరించింది.


దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  ఎండీ డా. బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: