కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా.. దగ్గినా పడిపోతుందని..అందుకే మజ్లీస్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాత అలవాటు ప్రకారం శాసన సభ గౌరవాన్ని కాల రాసిందని... మజ్లీస్ పార్టీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రోటెం స్పీకర్ ను చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని.. అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ ను చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు.

 
ప్రోటెం స్పీకర్ సమక్షంలో భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడాన్ని బహిష్కరిస్తున్నామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కాంగ్రెస్, మజ్లీస్ కు లోపాయికారీ ఒప్పందం ఉందని.. ఏ ప్రతిపాదికన ప్రోటెం స్పీకర్ ను చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం పై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని.. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: