తెలంగాణలో గోవధ జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో పరిస్థితిపై విమర్శలు గుప్పించారు. అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. గత పదేళ్లు తెలంగాణను పాలించిన భారాస హిందువులను అణిచివేసిన తరహాలోనే కాంగ్రెస్ వ్యవహారిస్తుందన్నారు. గోవులను వధించరాదని చట్టాలు చెబుతున్నాయని.. కానీ గోవులను తరలించే వాహనాలను అడ్డుకున్నందుకు హిందువులు, గో రక్షకులపై దాడి చేశారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు.

 
హిందువులను, గో రక్షకులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు దాడికి గురైన వారిపై నమోదు చేశారని.. 23మంది హనుమాన్ మాలధార చేసిన భక్తులపై కేసులు పెట్టారని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అనే అనుమానం కల్గుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శాంతి భద్రతలకు సంబంధించిన శాఖ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నపటికీ విచ్చలవిడితనం పెరిగిపోయిందని.. హిందువులపైన జరిగిన దాడులపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp