గూగుల్ పే వాడుతున్నారా..అయితే మీ పంట పండినట్లే .. మాములుగా ఆన్ లైన్ లావాదేవీలు చేసేవారికి ఈ యాప్ చక్కటి అవకాశాలను అందిస్తుంది. మీరు విన్నది నిజమే.. చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు చాలా సులువుగా ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేయడానికి ఈ యాప్ ను ఎక్కువగా వాడుతారు. ఇక ఈ సంస్థ కూడా కష్టమర్లను పెంచుకోవడానికి స్క్రాచ్ కార్డులను మరియు రివార్డులను కూడా అందిస్తుంది. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను కూడా అందిస్తుంది.



గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని అనుకొనే వారికి ఈ యాప్ అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తుంది. అదేంటో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై గూగుల్ పే అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ గ్యాస్ బుకింగ్ పై భారీ తగ్గింపు ను అందిస్తున్నారు.గూగుల్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.10 నుంచి రూ.500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు కనీసం రూ.500 లావాదేవీ నిర్వహించాలి. స్క్రాచ్ కార్డు రూపంలో మీకు ఈ డబ్బులు లభిస్తాయి. ఇకపోతే కేవలం గూగుల్ పే మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు అందిస్తున్నాయి.



పేటీఎం కూడా తన కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు అందిస్తోంది. రూ.500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా గ్యాస్ సిలిండర్ బుకింగపై రూ.30 తగ్గింపు అందిస్తోంది. మరో విషయమేంటంటే ఈ గ్యాస్ సిలిండర్ ధరలను రానున్ను రోజుల్లో పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచనలను చేస్తుంది.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.100 పెరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి ఆన్ లైన్ మనీ చెల్లింపు పై భారీ తగ్గింపును అందిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: