ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాయో ప్రత్యెకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆర్థిక ఇబ్బందులు జనాలను ఎంతగా భాధిస్తున్నాయో.. అలాంటి క్లిష్ట పరిస్థితి లో కొన్ని బ్యాంకులు జనాలకు అండగా నిలబడ్డాయి. అటువంటి బ్యాంకు లలో ఒకటి ఎస్‌బీఐ ఈ బ్యాంక్ తన కస్టమర్లకు ఎన్నో ఆఫర్ల ను అందించింది. లోన్స్ పై వడ్డీని తగ్గించారు.. కొత్త లోన్స్ ను ఇచ్చారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలను అందిస్తుంది...  కానీ ఇప్పుడు ఈ బ్యాంక్ జనాలకు షాక్ ఇస్తుంది.


బ్యాంక్ నుంచి డబ్బులను తీసుకొవాలని అనుకుంటే మాత్రం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం... కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. దీంతో కస్టమర్లపై ప్రభావం పడనుంది.ఎస్‌బీఐ బీఎస్‌బీడీ అకౌంట్ నిబంధనలను పూర్తిగా మార్చి వేసింది. ఈ రూల్స్ జీరో బ్యాంక్ అకౌంట్స్‌ కోసం.మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు. పేదల కోసం బ్యాంక్ ఈ తరహా అకౌంట్లను అందిస్తోంది. ఈ బ్యాంకులకు ఎలా అప్లై చేసిన ఏటీఎం కార్డు వస్తుంది.


ఇప్పుడు వీరికి బాదుడు పడింది.. నెల లిమిట్ ఉన్నంత వరకు డబ్బులు తీసుకోవ‌చ్చు.. తర్వాత విత్ డ్రా చేస్తె 15 రూపాయలు కట్ అవుతూంది. అది ఏటీఎం నెల చార్జీలు.. ఇది కాక జీఎస్టీ కింద అదనంగా డబ్బులు కట్ అవుతాయి.. నెలకు 4 సార్లు చార్జీలు లేకుండా డబ్బులు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.బ్యాంక్‌కు వెళ్లి మీరు డబ్బులు తీసుకోవాలన్నా ఇదే చార్జీలు పడతాయి. నెలకు నాలుగు సార్లు చార్జీలు లేకుండా డబ్బులు తీసుకోవచ్చు.. నాలుగు సార్లు దాటితే ఎక్కడైనా బాదుడు మాత్రం తప్పదు.. ఆగండి మరో విషయం గమనించాలి.. చెక్ బుక్ వాడితే దానికి కూడా డబ్బులు చెల్లించాలి.. బాబొయ్ ఈ విధానం ఏంటో .. ముందుకు ఇంకా ఎన్ని ఇలాంటి వాటిని తీసుకొస్తుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: