ఆంధ్రలో  హెలీ టూరిజం    

కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే తమ వ్యాపారాభి వృద్ధికి ద్వారాలు తెరుస్తున్నాయి. అందులో పర్యాటక రంగం కూడా ఒకటి. ఎన్నో పర్యాకట ప్రదేశాలున్న ఆంధ్ర ప్రదేశ్ లో టూరిజం రంగ అబివృద్ధి  మాత్రం ఆశించినంత అభివృద్ధి జరగలేదని ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.  విస్తారమైన  సముద్ర తీర ప్రాంతం, ప్రాచీన దేవాలయాలు,  ఉరకే జలపాతాలు, , గోదావరమ్మ పరవళ్లు.  కాశ్మీర్ పోటీ పడే లంబసింగి ప్రాంతం.. ఇలా ఒకటా రెండా..  ఎన్నో..ఎన్నెన్నో పర్యాటక ఆకర్షణలు ఆంధ్ర ప్రదేశ్ సొంతం.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ  హెలీ టూరిజంపై ఆసక్తి కనబరుస్తోంది. ఆ దిశగా తొలి అడుగులు వేస్తోంది.  దసరా ఉత్సవాల  సందర్భంగా ఆంధ్ర  ప్రదేశ్ లో హెలికాప్టర్ టూరిజం తాజాగ తెరవీుదకు వచ్చింది. విజయవాడ ఇందుకు కేంద్ర బిందువైంది. తొలుత ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. తరువాత ఇతర ప్రాంతలకు విస్తరించాలని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో  విజయ మున్సిపల్ కార్పోరేషన్, పర్యాటక  శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. ఇద్దరూ ఎం.ఓ.యు చేసుకున్నారు. నవరాత్రుల సందర్భంగా విజయవాడ లో వెలసి ఉన్న దుర్గమ్మ దర్శనానికి ఎక్కువ మంది  వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అదేే సమయంలో హెలికాప్టర్ టూరిజం ను ఏర్పాటు చేస్తే మరింత ఆదరణ ఉంటుందని  అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 7వ తేదీ నుంచి విజయవాడలో హెలీటూరిజం ను ప్రారంభిస్తున్నారు. విజయవాడ  విచ్చేసే  పర్యాటకులు హెలికాప్టర్ లో విజయవాడ- కృష్ణానది అందాలను తిలకించ వచ్చు. హెలీ టూరిజంలో అనుభవం ఉన్న తుంబై ఏవియేషన్ సంస్థ  హెలికాప్టర్ లను సమకూరుస్తోంది. కేవలం  ఏడుగురు మాత్రమే ప్రయాణించే వీలున్న హెలికాఫ్టర్ లను ఈ సంస్థ  హెలీ టూరిజం ప్రాజెక్టుకు సమకూరుస్తోంది. ఈ చాప్టర్ లు కేవలం సింగిల్ విండోను కలిగి ఉంటాయి.  పర్యాటకులు హెలికాఫ్టర్ ఎక్కి విజయవాడ అందాలను వీక్షించాలంటే ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందనే విషయం పై అధికారులు ఇంత వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. ఆరు నిమిషాల గగన విహారానికి మూడు వేల ఐదు వందల రూపాయలు, పదిహేను నిమిషాల ప్రయాణానికి ఆరు వేల రూపాయలుగా టిక్కెట్టు ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. ధరల విషయంలో అధికార వర్గాలు తర్జన,భర్జనలు పడుతున్నారు. ఆ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
హెలీ టూరిజం ను నిలకడగా నిర్వహిస్తారా ? లేక దసరా ఉత్సవాల వరకూ మాత్రమే పరిమితంగా నిర్వహిస్తా రా ? అన్న విషయం పై పర్యాటక శాఖ అధికారులు పెదవి విప్పటం లేదు. గతంలో హెలీ టూరిజం ను సూళూరు పేట, కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో నిర్వహించారు. వేళ్లమీద లెక్క పెట్టగలిగినన్ని రోజులు మాత్రమే ఇది నడిచింది. ఆ తరువాత ఈ ప్రాజెక్టు అటకెక్కింది. మరలా తెరమీదకు వచ్చిన ఈ ప్రతిపాదన ఎంత మేర సఫలం అవుతుందో వేచి చూడాలి.
------






































































































































































































































.

మరింత సమాచారం తెలుసుకోండి: