చాలా మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సబ్సీడీ ఇస్తుందని తెలియదు. ఇది వరకు గ్యాస్ సిలిండర్ 400 రూపాయల వరకు మాత్రమే ఉండేది. కానీ దాని వెనకాల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరించేది. ఈ విషయాలు చాలా మందికి తెలిసేవి కావు. దీంతో ఎవరూ పట్టించుకోలేరు. అయితే కేంద్రం సబ్సీడీ ఇవ్వడం మానేశాక గ్యాస్ సిలిండర్ ధర 1000 నుంచి 1200 రూపాయల వరకు పెరిగింది.


దీంతో ఇంత పెరుగుతుంది ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్ హాయంలో కూడా ఇలాంటివి జరిగేవి.అయితే సబ్సీడీలు ఎత్తేయడం ద్వారా ఇష్టారీతిన పెరిగిపోతుంది. అయితే గతంలో బంగారం ధరలు కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేసేది కానీ ఆ విధానానికి స్వస్తి పలికి అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగితే, ఇక్కడ పెరగడం, తగ్గితే ఇక్కడ తగ్గడం జరుగుతాయి.


కేంద్ర ప్రభుత్వం కేవలం రైతు లకు ఎకరానికి మూడు దఫాలుగా 6 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇంతకంటే ఎక్కువగా మరో అంశంపై ఖర్చు పెడుతోంది. దీని గురించి చాలా మందికి తెలియదు. రైతులకు ఎరువులు అందించే విషయంలో మూడు లక్షల ఆరవై ఎనిమిది వేల కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరియా ధరలు పెరగడంతో సబ్సిడీని కూడా కేంద్రం పెంచేసింది. 2025 వరకు సబ్సీడీ మీద యూరియా ఇవ్వబోతున్నారు.


45  కేజీల యూరియా బస్తా దాదాపు 2200 రూపాయలు ఉంటే దాన్ని 240 రూపాయలకు ఇస్తున్నారు. సేంద్రీయ ఎరువుల తయారీకి కేంద్రం  1451 కోట్ల రూపాయల మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. అంటే కేంద్రం ఎరువుల మీద ఇస్తున్న సబ్సీడీ చాలా ఎక్కువన్న మాట. ఇంత సబ్సిడీ భరిస్తున్నా.. నేరుగా వస్తున్న డబ్బులకే ప్రజలు ఎక్కువగా ప్రయార్టీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: